ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలో ఎటువంటి అనుమతులు లేకుండా ఒక ఆర్ఎంపి వైద్యుడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నడుపుతున్న జిల్లా వైద్యశాఖ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని యుగంధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీ, పిఎంపి వైద్యుల దోపిడిని అరికట్టాలనీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి విద్యార్హత లేకున్నా అత్యాధునిక వైద్యం పేరిట సామాన్య, మధ్య తరగతి ప్రజలను తీవ్ర దోపిడికి గురి చేస్తూ ఒకవేళ రోగం నయం కాకపోతే ప్రైవేట్ ఆస్పత్రులకు ముప్పై ఐదు శాతం కమిషన్ తీసుకొని రిఫర్ చేస్తున్నారని అదేవిధంగా పక్కనే మెడికల్ షాపును నిర్వహిస్తున్న వ్యక్తి దగ్గర సైతం ప్రిస్క్రిప్షన్ పేరిట కమిషన్లు తీసుకుంటూ హల్చల్ చేస్తున్నారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నెలకోన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై, దానిని నడిపించే ఆర్ఎంపీ వైద్యుడిపై విచారణ జరిపి నకిలీ వైద్యం చేస్తున్న తనపై నాన్ బేలేబుల్ క్రిమినల్ కేసు నమోదు చేసి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా వైద్య అధికారులు చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్ నగరంలో విచ్చలవిడిగా అనుమతులు లేని ఆసుపత్రులు వెలస్తున్నాయని నకిలీ డాక్టర్లు పుట్టుకొస్తున్నారని వీటిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అరికట్టాలని, అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బామండ్లపల్లి యుగంధర్ ప్రభుత్వాన్ని కోరారు.