carekkannunna mla gandra, కారెక్కనున్న ఎమ్మెల్యే గండ్ర…?

కారెక్కనున్న ఎమ్మెల్యే గండ్ర…?

తెలంగాణ రాష్ట్రంలో ఒకొక్కరుగా హస్తాన్ని వీడి కారెక్కుతుండగా మరో ఎమ్మెల్యే కూడా ఇప్పుడు కారు ఎక్కుతున్నట్లుగా తెలుస్తుంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది. గత కొద్దినెలలుగా టిఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానంతో టచ్‌లో ఉంటున్న ఆయన సతీసమేతంగా గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. మొన్నటి వరకు మంత్రిపదవి కావాలని, ఇస్తేనే పార్టీలో చేరుతానని చెప్పడంతో అధిష్టానం కొద్దిగా ఆలోచనలో పడింది. సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి గండ్ర జ్యోతికి ఇస్తామని గులాబీ బాస్‌ హామీ ఇవ్వడంతో గండ్ర దంపతులు కారెక్కేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వారం రోజుల్లో వీరు గులాబీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచి గండ్ర వెంకటరమణరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరితే ఇక కాంగ్రెస్‌ పార్టీకి మిగిలింది ఒకే ఒక్క ఎమ్మెల్యే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!