ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలి

ఎన్నికల సాంకేతిక ప్రక్రియ వేగంగా సాగుతుంది

వికలాంగులు, వృద్ధులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలి

పాలకుర్తి రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్

పాలకుర్తి, నేటిధాత్రి

పాలకుర్తి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలని పాలకుర్తి ఎన్నికల అధికారి రోహిత్ సింగ్ అన్నారు. ప్రచార రథాలను తిప్పడంలో సమయ పాలన పాటించాలని, సభలు, సమావేశాలు ఎన్నికల నియమావళికి లోబడి నిర్వహించాలని లేని యెడల ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద కేసులు నమోదు చేస్తామని అన్నారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలోని 294 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన (ఈవీఎం) ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ సాంకేతిక ప్రక్రియను వేగవంతం చేశామని రోహిత్ సింగ్ తెలిపారు. 36 మంది సెక్టార్ అదికారుల పర్యావరణ లో ఈవిఎం ల సాంకేతిక ప్రక్రియ కొనసాగుతుందని పోటీలో ఉన్న అభ్యర్థుల బ్యాలెట్ పేపర్ పొందుపరిచే ప్రక్రియ పూర్తయినదని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్ష నిర్వహించామని అభ్యంతరాలు లేవని తెలిపారు. మాక్ పోలింగ్ నిర్వహించామని తెలిపారు. ఈ నెల 24,25 తేదీలలో ఓపిఓ లో శిక్షణ కార్యక్రమం ఉంటుదని 29 వ తేదీ రాత్రి వరకు ఎన్నికల సామాగ్రి,ఈవిఎం లను పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరుగుతుందని తెలిపారు. 30 వ తేదీ ఉదయం 5:30 గంటల కు పోలింగ్ కేంద్రాలలో మాక్ పోలింగ్ నిర్వహించి 7:00 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఓటింగ్ ముగిసిన తర్వాత ఈవిఎం లను ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూములలో భద్రపరిచి ఒకటవ తేదీన జిల్లా కు పంపించడం జరుగుతుందని తెలిపారు.
ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ కొనసాగుతోందని తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి దగ్గరనే ఓటువేసే సదుపాయం కల్పించామని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వికలాంగులు, వృద్ధులు ఇంటి దగ్గర కు వచ్చిన పోలింగ్ సిబ్బంది వద్దనే ఓటు హక్కు వినియోగించుకోవాలని లేని యెడల ఓటు రద్దవుతుందని, వారు పోలింగ్ కేంద్రాలలో ఓటు వేసే అవకాశం కోల్పోతారని తెలిపారు. ఈ సమావేశంలో మండల తహశీల్దార్ వెంకటేషం, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!