
New DS pending
రద్దు ఆఘమేఘాలమీద.కొత్తవి డిఎస్ పెండింగ్.
◆- నూతన రేషన్ కార్డుల పంపిణీపై లబ్ధిదారుల్లో అసంతృప్తి
◆- ప్రభుత్వం కావాలనే కార్డులు నిరాకరిస్తోందని ఆరోపణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం,మండలంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించగానే అర్హులైన లబ్ధిదారులు తాము ఇప్పటివరకు ఉన్న కుటుంబ రేషన్ కార్డుల నుంచి తమ పేర్లను తొలగించించుకొని, కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా వివాహితులు మరియు స్వతంత్రంగా వేరుగా నివసిస్తున్న యువకులు పెద్ద సంఖ్యలో తమ పేర్లు పాత రేషన్ కార్డుల నుండి తొలగించించుకున్నారు.
అయితే, దరఖాస్తు చేసిన తర్వాత చాలామంది “DS Pending” స్థితిలోనే ఉండిపోతున్నారు. దీనివల్ల కొత్త కార్డులు జారీ కాకుండా గందరగోళం ఏర్పడుతోంది. ప్రభుత్వమే కావాలనే కార్డులను ఇవ్వకుండా కుట్ర పన్నిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఝరాసంగం మండలంలో ఒక్కో గ్రామానికి కేవలం 10 నుండి 12 మంది దరఖాస్తుదారులకే “DS Pending” స్థితి లేదని చూపిస్తున్నారు. మిగిలిన అర్హులు ఎందుకు లేరని ప్రశ్నిస్తున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ యువనాయకులు పరమేశ్వర్ పాటిల్ మాట్లాడుతూ,
> “ప్రభుత్వం కావాలనే నూతన కార్డులను నిలిపివేసి, వేలాది మంది అర్హులైన లబ్ధిదారులను విస్మరిస్తోంది. ఇది ప్రజలకు వ్యతిరేకంగా సాగుతున్న చర్య. నూతన కార్డులపై ఉన్న DS Pending సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం,” అన్నారు.