Campaign Ban Until Polls End
రెండో విడత ఎన్నికలు ముగిసే వరకు ప్రచారంపై నిషేధం
జహీరాబాద్ నేటి ధాత్రి:
రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న మండలాల్లో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికలు ముగిసే వరకు ప్రచారాలపై నిషేధం విధించినట్లు కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు. ఆందోల్, చౌటకూర్, ఝరాసంగం, కోహిర్, మొగుడంపల్లి, మునిపల్లి, పుల్కల్, రాయికోడ్, వట్పల్లి, జహీరాబాద్ మండలాల్లో ఈ నిషేధం అమలవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
