
భద్రాచలం నేటి ధాత్రి
జన సమీకరణ కోసం నియోజకవర్గాల ఇన్చార్జిల నియామకం ..
ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ
స్థానిక టీఎన్జీవో భద్రాచలం కార్యాలయం నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం ఎమ్మార్పీఎస్ భద్రాచలం పట్టణ అధ్యక్షుడు పుట్టబంజర ప్రకాష్ మాదిగ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ…….. మహాజన నేత గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు నవంబర్ 11 జరుగు మాదిగల విశ్వరూప మహాసభ విజయవంతం చేయడానికై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం మరియు జన సమీకరణ కోసం నియోజకవర్గ ఇన్చార్జిల బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జిగా వంగూరు ఆనందరావు మాదిగ, అశ్వరావుపేట నియోజకవర్గం ఇన్చార్జిగా కోలికపోగు వెంకటేశ్వర్లు మాదిగ, పినపాక నియోజకవర్గం ఇన్చార్జిగా దేపంగి రమణయ్య మాదిగ, ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జిగా అలవాలరాజా మాదిగ, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జిగా ఇసంపల్లి కృష్ణ మాదిగలను నియమించడం జరిగింది. ఈ నియోజకవర్గ ఇన్చార్జి బృందం సభ్యులంతా కలిసికట్టుగా తమ నియోజకవర్గ పరిధిలోని ప్రతిబస్తీ, ప్రతి కాలనీ, ప్రతి గ్రామానికి వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహించి జన సమీకరణ కోసం కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు మచ్చ వీర్రాజు మాదిగ,కొమ్ము హుస్సేన్ మాదిగ, ఇసుకల కొండయ్య మాదిగ, అలవాల సతీష్ మాదిగ, దేపంగి రామచంద్ర మాదిగ, కొమ్మగిరి వెంకటేశ్వర్లు మాదిగ, కోట ప్రభాకర్ మాదిగ,కనుక శ్రీనివాస్ మాదిగ, బొక్క రాంబాబు మాదిగ, తోకల దుర్గ ప్రసాద్ మాదిగ, బొడ్డు సత్యనారాయణ ,మూయిని శివ మాదిగ, కారుమంచి సతీష్ మాదిగ, పింగిలి నాగరాజు మాదిగ, కోట రవి మాదిగ, మురికిపూడి రాజు మాదిగ, మహిళా సమైక్య నాయకులు మేకల లత ,తెల్లం సమ్మక్క, మిర్యాల రమాదేవి, ఏర్పుల సూర్యవంశం, గుండె సుహాసిని, చిప్పనపల్లి సమత, కొచ్చర్ల కుమారి, కొప్పుల నాగమణి, తదితరులు పాల్గొన్నారు