#నెక్కొండ, నేటి ధాత్రి :
నెక్కొండ గ్రామపంచాయతీ లోని 14 వ వార్డులోని సూర్య థియేటర్ వెనుక టీచర్స్ కాలనీ 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు జరిగినది దాని పక్కన బీసీ కాలనీ కూడా ఏర్పాటు జరిగినది ఈ రెండు కాలనీలకు నెక్కొండ సూర్య థియేటర్ పక్కన నుండి 21 ఫీట్ల రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది ఆ దారికి సిసి రోడ్డు వేయాలని అట్టి రోడ్డును కొందరు ప్రైవేటు వ్యక్తులు దారి మళ్ళించడానికి ప్రయత్నిస్తున్నారు కావున గ్రామపంచాయతీలో అప్రూవల్ ప్రకారం ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫార్మేషన్ రోడ్డునే సిసి రోడ్డు గా వేయాలని మంగళవారం నాడు టీచర్స్ కాలనీవాసులు నెక్కొండ గ్రామపంచాయతీ సెక్రటరీ సదానందంకు వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యదర్శి పరిశీలించి తగిన చర్యలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా టీచర్స్ కాలనీవాసులు తగిన విధంగా చర్యలు చేపట్టాలని కోరినారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ సభ్యులు గాజుల మల్లయ్య, ఉడుగుల వెంకటేశ్వర్లు, పరికిపండ్ల వేణు, కుడికాల వెంకటేశ్వర్లు, ఆర్ సదయ్య, ఎం రాజేశ్వర్, కుడికాల రఘు,కొల మహేష్ తదితరులు పాల్గొన్నారు.