రాజ్యాంగాన్ని మారుస్తామని మాట్లాడిన పార్టీకి ఓటుతో ప్రజలే బుద్ధి చెప్పారు

చిట్యాల.నేటిధాత్రి :

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు గత 75 సంవత్సరాలుగా భారత రాజ్యాంగం ద్వారా పరిపాలనను కొనసాగించడమే కాకుండా ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం జరుగుతుందని 3వ ఆర్టికల్ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరుగిందని భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని తగిన మేజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామనడం వలనే ఆ రాజ్యాంగం కల్పించిన ఓటు తో ప్రజలు పార్లమెంట్ ( లోక సభ) ఎన్నికల్లో ఎక్కువ ( అదిక) మేజార్టీ రాకుండా ఓటు హక్కు ఉన్న ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ది చెప్పారని తెలంగాణా రాష్ట్ర అంబెడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య. అన్నారు.
శఉక్రవారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన జరిగిన సంఘం సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య జిల్లా ప్రచార కార్యాదర్శి గుర్రపు రాజేందర్ సాంస్కృతిక కార్యాదర్శి జన్నే యుగేందర్ లు మాట్లాడుతూ..మన భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి భారత దేశం తో పాటు ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన మహానీయుడని తెలిపారు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ద్వారా నాటి నుండి వివిధ పార్టీలు పరిపాలనను కొనసాగించాయని ఈ ప్రభుత్వం కూడా గత 10 సంవత్సరాలు పరిపాలనను కొనసాగించడమే కాకుండా ఈ పార్లమెంటు ఎన్నికల్లో 400ల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామనడం వలనే ప్రజలు అదే రాజ్యాంగం కల్పించిన ఓటు తో తగిన మెజారిటీ రాకుండా వారికి బుద్ధి చెప్పారని అన్నారు. . . గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలు కొని అసెంబ్లీ, పార్లమెంటు ఇతర ఎన్నికల్లో గెలుపొందిన ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం పై ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నారని తెలిపారు. భారత రాజ్యాంగం గురించి ఎవరు తప్పుగా మాట్లాడిన వారికి బడుగు బలహీన వర్గాలైనఎస్సి ఎస్టీ బిసి మైనార్టీ కులాలకు చెందిన వారు తగిన బుద్ది చెబుతామని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి ఆశయాలు సిద్దాంతాలు కొనసాగించాలని వారు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *