పాత బాకీలు తీర్చడంతోనే..
సమయం సరిపోతుంది.
• గత ప్రభుత్వం అప్పుల కుప్ప తెచ్చిపెట్టింది.
• ఇచ్చిన మాట తప్పిన గత ప్రభుత్వం!
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
నిజాంపేట: నేటి ధాత్రి
గత ప్రభుత్వం చేసిన పాత బాకీలు తీర్చడంతోనే సమయం సరిపోతుందని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో మంగళవారం లీల గ్రూప్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. గత ప్రభుత్వ హయాంలో మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టారని విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి మరెన్నో అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ప్రజలకు మోసపూరిత మాటలపై అవగాహన కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలు అవగాహన పెంచాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ తోనే ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, నిజాంపేట మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్, నాయకులు కొమ్మాట బాబు, నజీరుద్దీన్, మారుతి, లక్ష్మా గౌడ్ తదితరులు ఉన్నారు.