శేరిలంగంపల్లి,:-నేటి ధాత్రి:
చందానగర్ డివిజన్ పరిధిలోని కైలాస్ నగర్ లో అమీన్పూర్ వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న బచ్ పన్ స్కూల్ లో దాదాపు 2 3 వందల మంది చిన్న పిల్లలు చదువుకుంటున్నారు ఒక దిక్కు స్కూలు నడుస్తుండగానే స్కూలు భవనము పైన భారీ షెడ్డు నిర్మాణం చేస్తున్నారు అభం శుభం తెలియని చిన్నచిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఇట్టి భవనం పైన షెడ్డు వేస్తుంటే ఏమైనా జారీ కిందపడినచో భావిభారత పౌరులకు అన్యాయం జరుగుతుంది మరియు భవనం పైన వేసే షెడ్డు కు ఎలాంటి ఫిట్నెస్ ఉండదు గట్టిగా గాలి వాన వచ్చినచో వచ్చి కింద పడుతుంది అభం శుభం తెలియని చిన్నచిన్న పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఎంతైనా ఉన్నది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది కానీ అధికారులు ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేరు ఉన్నత అధికారులు పట్టించుకోని ఇట్టి షెడ్డు ను వెంటనే తొలగించవలసిందిగా బి ఆర్ ఎస్ పార్టీ శేర్లింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షులు ప్రజల కోసం రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలియపరిచారు