భద్రాచలం. నేటి ధాత్రి
భద్రాచలం పట్టణంలో బ్రిడ్జి సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు విశాలమైన రోడ్లు ఉన్నాయి, కానీ ఈ బ్రిడ్జి సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు విశాలమైన రోడ్లను కొన్ని వ్యాపార సంస్థలు సగం రోడ్డు వరకు ఆక్రమించుకొని తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. సగం రోడ్డు వరకు ఆక్రమించడం వలన బ్రిడ్జి సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు రెండు వైపులా వాహనాల పార్కింగ్ సమస్య ఏర్పడుతుంది, ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా బస్టాండు ఇన్ గెట్ ప్రాంతంలో నాలుగు రోడ్ల కోడలి వద్ద ఉన్న కొన్ని ప్రైవేటు వైద్యశాలలు,కొన్ని వ్యాపార సముదాయాలు తమ ఇష్టాను రీతిగా పుట్ పాత్ లను దాటి దాదాపుగా సగం రోడ్డుని ఆక్రమించడం వలన ఆ ప్రాంతంలో నిత్యం ప్రయాణికులు, వివిధ ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ దాదాపుగా జాతీయ రహదారిని సగం వరకు ఆక్రమించడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యాపారస్తులు ఫుట్ పాత్ లను ఆక్రమించడమే కాకుండా, ఫుట్ పాత్ మీద మరియు ప్రధాన మురికి కాలువ మీద శాశ్వతమైన కట్టడాలు కట్టడం జరిగింది. లక్షలాది రూపాయలతో కోట్లాది రూపాయలతో వ్యాపార సముదాయాలు, ప్రైవేటు హాస్పటల్లో నిర్మించిన యాజమాన్యులు కనీసం వారు పార్కింగ్ స్థలం కూడా ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. బిడ్జీ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకున్న ప్రధాన మురికి కాలవను ఇప్పటివరకు శుభ్రం చేసి దాదాపుగా పది సంవత్సరాలు దాటి దాటింది. మురికి కాలువ శుభ్రం చేయలేకపోవటానికి ప్రధాన కారణం కాలవల మీద శాశ్వతమైన కట్టడాలు కట్టడం వలనే. అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ ముందు వరకు ఉన్న మురికి కాలువ ద్వారాగా ఈ ప్రాంతంలో హోటల్లు, హాస్పిటల్స్ లోని వ్యర్థ పదార్థాలు మొత్తం ఈ కాలలులో ప్రవహించి, ఈ కాలవ అశోక్ నగర్ కాలనీ ద్వారాగా గోదావరి నదిలో కలుస్తుంది. ఈ వ్యర్ధ జలాలు, వ్యర్థ పదార్థాలు గోదావరిలో కలిసే ప్రాంతం పక్కనే భద్రాచలం పట్టణానికి మంచినీటిని అందిస్తున్న పంపు హౌస్ ఉండటం గమనార్హం. ఈ వ్యర్ధ జలాలను భద్రాచలం పట్టణం మొత్తం మంచినీరుగా పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంబేద్కర్ సెంటర్లో కొన్ని రెస్టారెంట్ల వాళ్ళు దాదాపుగా సగం రోడ్డున ఆక్రమించుకొని వారి రెస్టారెంట్లకు వచ్చే వాహనాలను రోడ్ల మీదే పార్కింగ్ చేయడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఆర్టీసీ వ్యాపార సముదాయాలకు సంబంధించి ఆర్టీసీ వ్యాపార సముదాయాల్లో వ్యాపారస్తులు కూడా జాతీయ రహదారిని ఆక్రమించుకొని శాశ్వతమైన కట్టడాలు కట్టి జాతీయ రహదారిని ఆక్రమించుకోవడం జరిగింది. ఈ జాతీయ రహదారిని ఆక్రమించుకోవడం వలన వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలో అర్థం కాని పరిస్థితి. గత రాత్రి ఒక రెస్టారెంట్ ముందు పార్కింగ్ చేసిన వాహనం వలన ప్రమాదం జరగడం జరిగింది. రోడ్ల పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని నిరుపేదలు జీవనోపాధి పొందుతున్న వారిపై అధికారులు మాత్రం జులం చూపిస్తారు గాని, ఇటువంటి పెద్దపెద్ద వ్యాపారస్తులు, రెస్టారెంట్లు, హాస్పటల్ రోడ్లు,పుట్ పాత్ లు ఆక్రమించుకునన్న వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జి సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు రోడ్డు ఇరువైపులా ప్రమాదాలకు, ట్రాఫిక్ కు అంతరాయానికి కారణం అవుతున్న వ్యాపారస్తులు, హాస్పిటల్స్ ,రెస్టారెంట్ల మీద చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.