భూకబ్జాలతో మాకు సంబంధం లేదు
కార్పొరేటర్ మేడిది రజిత మధుసూదన్
నేటిధాత్రి బ్యూరో: గ్రేటర్ వరంగల్ నగరంలో ఎలాంటి భూకబ్జాలతో తమకు సంబంధం లేదని 21వ డివిజన్ కార్పొరేటర్ మేడిది రజిత మధుసూదన్ ‘నేటిధాత్రి’కి స్పష్టం చేశారు. భూకబ్జాల విషయంలో తమ డివిజన్‌ను ప్రస్తావించడాన్ని వారు ఖండించారు. మూడు దశాబ్ధాల రాజకీయ జీవితంలో తన భర్త కాని, 21వ డివిజన్‌లో ప్రజాభిమానాన్ని చూరగోని భారీ మెజార్టీతో గెలుపొందిన తానుగానీ, ప్రజల పక్షమే నిలుస్తాం తప్ప ప్రజావ్యతిరేకమైన పనులను ఏనాడు చేయమన్నారు. 21వ డివిజన్‌లో ఎలాంటి భూకబ్జాలకు తాము పాల్పడటం కానీ, ఎవరికీ సహకరించడం కానీ చేయడం లేదని అన్నారు. ఎవరు గిట్టని వారు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని, భూములను కోల్పోయిన భాదితులు ఎవరైన తమపై ఆరోపణలు చేస్తే అవి తప్పని నిరూపించడానికి తాము సిద్ధమన్నారు. కార్పోరేటర్‌గా గెలిచిన దగ్గర నుంచి ప్రజల్లో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేశామే తప్ప అక్రమాలకు ఎన్నడు పాల్పడలేదని, పాల్పడబోమని అన్నారు. తమపై ఎవరైన నారాధారమైన ఆరోపణలు చేస్తే అవి తప్పని నిరూపిస్తామని, చేయనప్పుడు తాము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాసేవ చేయడం తప్ప కబ్జాలు, అవినీతి, అక్రమాలు చేయడం తమకు రాదన్నారు. డివిజన్‌లో ఎవరిని పలకరించిన తమకు క్లీన్‌చీట్ ఇస్తారని రాజకీయాల్లో నీతిగా తాము మెదలుతున్నామన్నారు.