
Tattu Narayana, former Sarpanches
జహీరాబాద్ నుండి బోనస్పూర్ వరకు బిటి రోడ్డు పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టేలి
◆:- బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ పరిసర గ్రామాల మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీ లు నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నుండి బోనస్పూర్ వరకు రెండున్నర సంవత్సరాల కిందట గత బిఆర్ఎస్ ప్రభుత్వం జహీరాబాద్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మానిక్ రావు గారు ఉమ్మడి మెదక్ జిల్లా DCMS చైర్మన్ శ్రీ శివకుమార్ గారు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసన సభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి సహకారంతో బీటీ రోడ్డు పనుల పునరుద్ధరణకు నాలుగు కోట్ల 36 లక్షల రూపాయలను మంజూరు చేయించినారు అట్టి పనులను అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ ఇప్పటివరకు పనులు చేపట్టలేదు గత పది నెలల కిందట షేకాపూర్ లో ప్రముఖ షేక్ షాబుద్దీన్ దర్గా ఉర్సు ఉత్సవాల ముందు కాంగ్రెస్ నాయకులు రోడ్డు పనులు ప్రారంభిస్తామని సదరు కాంట్రాక్టర్ ను తీసుకువచ్చి పనులు ప్రారంభించి తూతూ మంత్రంగా షేకాపూర్ ప్రధాన రోడ్డును తవ్వి కంకర వేసి వదిలేసినారు ఈ రోడ్డు మీదుగా ప్రతిరోజు వేల వాహనాలు ఆనేగుంట మల్చల్మ గొట్టిగార్పల్లి వెంకటాపూర్ కుంచారం తాండూర్ కర్ణాటక చించోలి తదితరు రూట్లలో ప్రజలు ప్రయాణాలు సాగిస్తుంటారు రోడ్డు గుంతల మయంగా మారడంతో అనేకమంది వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు
కొందరు ప్రాణాలను సైతం కోల్పోవడం జరిగింది కావున అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క బీటీ రోడ్డు పనులను ప్రారంభింపజేసేలా కాంట్రాక్టర్ను ఆదేశించాలని లేదా కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని ఈరోజు ఆర్ అండ్ బి డిఈ కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తట్టు నారాయణ మాట్లాడుతూ షేక్ శాబోద్దీన్ దర్గా ఉత్సవాలు జరగడానికి ముందే ఈ యొక్క పనులను కంప్లీట్ చేయాలని లేకపోతే పక్షం రోజుల్లో సమీప గ్రామాల ప్రజలను సమీకరించుకొని జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డును దిగ్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో శేఖపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ చిన్న రెడ్డి, మాజీ సర్పంచులు జగదీష్, మాజీ ఎంపీటీసీ లు ప్రేమ్ బాణోత్, ఇస్మాయిల్ ,మోయిన్,మండల బిఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు వహీద్ అలీ, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు హీరు రాథోడ్, మండల సోషల్ మీడియా అధ్యక్షులు విజయ్ రాథోడ్ ఉప సర్పంచ్ మహబూబ్ ఖాన్, నాయకులు రాథోడ్ బీమ్ రావ్,మోహన్ రాథోడ్, గులాబ్ సింగ్, చందర్, సికిందర్ తదితరులు పాల్గొన్నారు.