తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ పనిచేసే ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ 2014 ఎలక్షన్ లో కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా గెలుపొంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన అన్న వినోద్ కుమార్.నీ గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఎంపీగా ఉన్న సందర్భంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని కేసీఆర్ వేన్నటి ఉండి అనేక ఉద్యమాలు చేశారని అభివృద్ధిలో కరీంనగర్ స్మార్ట్ సిటీగా ఏర్పడడానికి కృషి చేశారని కొత్తపల్లి నుండి మనోహరాబాద్ రైల్వే స్టేషన్ లైన్ ఏర్పాటు చేయించారని వేళ్ళకోట్లతో రహదారులు విస్తరింప చేశారని అంతేకాకుండా కొండగట్టు ఆలయ అభివృద్ధి కొరకు 330 ఎకరాల గవర్నమెంట్ భూమిని దేవాలయానికి అప్పజెప్పడం జరిగిందని అంతేకాకుండా నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత తనకే దక్కుతుందని పార్లమెంట్లో తెలంగాణ తరఫున ప్రశ్నించిన గొంతుకు వినోద్ అన్నాఅని ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గెలిచి ఐదు సంవత్సరాలు అయినా కూడా ఏమీ అభివృద్ధి చేయలేదని సిరిసిల్ల నేతన్నలకు గాని వేముల రాజన్న దేవాలయం గాని రూపాయి కూడా తీసుకురాని వ్యక్తి బండి సంజయ్ అని మళ్లీ ఏమి పెట్టుకొని ఓటు అడగడానికి వస్తారని కాంగ్రెస్ మాయమాటలకు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని ఎవరో ముక్కు ముఖం తెలియని దమ్మి అభ్యర్థులు పెట్టి బిజెపి కాంగ్రెస్ కుమ్మక్కై రాజకీయ దెబ్బతీయాలని చూస్తున్నారని ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన కరీంనగర్ లో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని కరీంనగర్ ప్రజలు విద్యార్థులు నిరుద్యోగులు యువత మహిళలు అన్న వినోద్ కుమార్ వెంటనే ఉన్నారని వినోద్ కుమార్ అన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్ నవీన్ రాకేష్ కూడా వెంకటేష్ ఒగ్గు అరవింద్ రోహిత్ నవీన్ సందీప్ తదితరులు పాల్గొన్నారు