ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు
– శంకర్ గౌడ్‌కు ఘన నివాళులు
– బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి

సిరిసిల్ల ప్రతినిధి(నేటి ధాత్రి):

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బిఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు.ఈ నేపథ్యంలో నర్సాపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, అనంతరం మరణించడంతో కార్మికుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతిపై చింతిస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు ఆర్టీసీ కార్మికులు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, నాయకులు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవేనని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బిఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, బిఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు, ఇతర బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు మరియు కార్మికులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version