ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి
మున్సిపల్ వైస్ చైర్మన్ రాజీవ్ రెడ్డి
చేర్యాల నేటిధాత్రి…
జనగామ జిల్లా కేంద్రంలో 16వ తేదీన సీఎం కేసీఆర్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు చేర్యాల పట్టణంలో ఏర్పాట చేసిన విలేఖరుల సమావేశంలో రాజీవ్ రెడ్డి మాట్లాడారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మూడోసారి విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యాయనం సృష్టించబోతుందని పేర్కొన్నారు. అలాగే బిఆర్ఎస్ ప్రభుత్వం హైట్రిక్ సాధించడమే కాకుండా కెసిఆర్ మూడోసారి సీఎం గా గెలిచి రికార్డు సృష్టిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరలా గెలిపించుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని కోరారు. మూడోసారి కూడా కెసిఆర్ ను ముఖ్యమంత్రిని అలాగే స్థానిక జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. అయనతో పాటు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి, కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీష్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు ఎండి నాజర్, కొమురవెల్లి ఆలయ మాజీ డైరెక్టర్ అమర్ గౌడ్,సిద్ధిరాములు గౌడ్, అవుశర్ల వెంకటేష్ తదితరులు ఉన్నారు.