డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్యానాయక్ ఎదురులేదు
ప్రతిపక్షాల కాలం చెల్లింది
కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్.
మరిపెడ నేటిదాత్రి.
అభివృద్ధి సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు శ్రీరామరక్షగా నిలుస్తూ మూడోసారి ముఖ్యమంత్రి కెసిఆర్ అవుతారని, శనివారం మరిపెడ మండలంలోని రాంపురం గ్రామంలో ని ఎస్సీ కాలనీలో సవార్ లచ్చమ్మ తల్లి దగ్గర కొబ్బరి కాయ కొట్టి,ప్రత్యేక పూజలు చేసి ప్రచార కరపత్రాలను తల్లి దగ్గర ఉంచి మా ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని పూజలు చేశారు,అనంతరం రెడ్యానాయక్ గెలుపు కోసం ముఖ్య కార్యకర్తలతో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంపల్లి రవి గౌడ్ మాట్లాడుతూ బంగారు. తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు రైతుబంధు,రైతు బీమా,దళిత బందు,బీసీ బందు,ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడని, డోర్నకల్ నియోజకవర్గం నీ తాగునీరు,సాగునీరు,సంక్షేమ పథకాలు,రోడ్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆరుసార్లు గెలిచి ఏడోసారి గెలిపిస్తే పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి రాజకీయాల నుంచి వెళ్లిపోతాడని రెడ్యా నాయక్ కు చివరి అవకాశం ఇచ్చి గెలిపించాలని బిఆర్ఎస్ ప్రభుత్వ నికి చేదోడు వాదోడుగా సబ్బండ కులాలు కెసిఆర్ నాయకత్వానికి కృషి చేయాలన్నారు,కెసిఆర్ అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్,ఎంపీటీసీ కొమ్ము నరేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు బందు పరశురాములు, ఉపసర్పంచి స్వరూప రాజలింగం, ఆరో వార్డు మెంబర్ యశోద ఇద్దయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాంపల్లి నాగన్న,రాంపల్లి చిన్న వెంకన్న, అనుముల నాగిరెడ్డి,ఈరగని శ్రీనివాస్,దోమల సత్తయ్య,అల్వాల లక్ష్మయ్య,గ్రామ యూత్ నాయకులు రాంపల్లి రంజిత్,దోమల లక్ష్మణ్,ఈరగాని లింగన్న, గ్రామ సోషల్ మీడియా వారియర్ గోనె మహేష్,పాల్వ ఎల్లయ్య, చిన్న పరిష, తదితరులు పాల్గొన్నారు.