
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పరిధిలోగల వివిధ గ్రామాలకు చెందిన తాజా మాజీ సర్పంచులు , ఎంపీపీ తో సహా పలువురు ఎంపీటీసీలు సభ్యులు, సింగిల్ విండో చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆదివారం మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షులు బలమూరి అరవిందరావు ఆధ్వర్యంలో సమావేశమైన తాజా మాజీ సర్పంచులు, పదవిలో కొనసాగుతున్న ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు సింగిల్ విండో చైర్మన్, పలువురు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే 9 మంది సర్పంచులు తర్వాత ఇద్దరు సర్పంచులు రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీని వీడినారు. పార్లమెంట్ ఎన్నికలవేళ ప్రస్తుతం 9 మంది సర్పంచులు అసంపల్లి సువర్ణ రాజమల్లు, మేడి రవి, దూట రాజకుమార్, పడాల రాజమణి మల్ల గౌడ్, ఆవిడపు గణేష్, జాడి సారయ్య, ఇజ్జగిరి సమ్మయ్య, గడ్డం మంజుల ప్రసాద్, కొయ్యడ వెంకటేశ్వర గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ గుండు తిరుపతి, ఎంపీపీ గోదారి రమాదేవి లక్ష్మణ్ తో సహా నలుగురు ఎంపీటీసీ సభ్యులు రాచర్ల సతీష్, రామటెంకి లింగస్వామి, బోయిని స్వాతి సంపత్, నరెడ్ల స్వాతి గోపాల్ రెడ్డి వీరితోపాటు పలువురు వార్డ్ మెంబర్స్ , మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామాలు చేసినారు. రెండు రోజుల్లో భవిష్యత్ నిర్ణయం ప్రకటిస్తామని రాజీనామా చేసిన నాయకులందరూ పేర్కొన్నారు. ఈ రాజీనామాల చర్యతో జైపూర్ మండల పరిధిలో బిఆర్ఎస్ పార్టీ బలహీన పడినట్లుగా తెలుస్తుంది.