
జైపూర్ , నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఆదివారం రోజున కొందరు నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఆంటీని వీడుతూ తల్లి లాంటి పార్టీలోకి చేరుతున్నామనీ చేసిన వ్యాఖ్యలకు సోమవారం రోజున జైపూర్ మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి నాయకులు తీవ్రంగా ఖండించడం జరిగింది. కొంతమంది నాయకులు వెళ్ళినంత మాత్రాన మా బిఆర్ఎస్ పార్టీకి వచ్చిన డోకా ఏమీ లేదని అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఉండి లాభపడి ఇప్పుడు స్వార్ధ రాజకీయాల కోసం సొంత అవసరాల కోసం అమ్మలాంటి పార్టీని వీడి వెళ్లిన వారికోసం బిఆర్ఎస్ పార్టీ బాధపడదని
వారు వెళ్ళగానే పార్టీ కి పట్టిన మరక జిడ్డు పోయిందని, ఇప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీకి నికార్స్ అయినా నాయకత్వం ఉందని, కెసిఆర్ మరియు బాల్క సుమన్ ఆధ్వర్యంలో జైపూర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉందని పార్టీని ప్రజలు కూడా అందరిస్తారని తెలియజేయడం జరిగింది.