గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా), నేటిధాత్రి :
గుండాల మండలంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గురువారం జోరుగా ప్రచారం కొనసాగించారు. మండల కేంద్రంలోని ఇంటింటికి వెళ్లి గోడ పత్రికలను అతికిస్తూ మేనిఫెస్టో లో ఉన్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అందరూ
బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి పినపాక ఎమ్మెల్యే గా రేగా కాంతారావును గెలిపించాలని మన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని , కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, యూత్ అధ్యక్షులు సయ్యద్ అజ్జు, పిఎసిఎస్ చైర్మన్ గోగ్గెల రామయ్య, బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు నీట్ట రాములు, అటికం నాగేశ్వరరావు, రవీందర్, నాగన్న, గోగ్గెల రాంబాబు,గోగ్గెల లక్ష్మీనారాయణ, ప్రమోద్, ప్రశాంత్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.