తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన మంత్రి కేటీ రామారావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాలనీలో గడపగడప ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన అభివృద్ధి ప్రదాత మంత్రి కేటీ రామారావు మండలంలోని ప్రతి గ్రామంలో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరచారాని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్లీ మన బిఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్.మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని అలాగే దేశంలోనే మన తెలంగాణను ఇంకా ఎంతోఅభివృద్ధి పరుస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు