
# కాంగ్రెస్ జిల్లా నాయకులు బీసీ నేత. సాయిలి ప్రభాకర్.
వరంగల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
ఆర్థిక వనరులను సృష్టించుకుంటూ సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బి ఆర్ ఎస్ నేతలు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్,మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని
కాంగ్రెస్ జిల్లా నాయకులు, బీసీ నేత సాయిలి ప్రభాకర్ ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
టిఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు స్వేచ్ఛ లేకుండా ధర్నా చౌకీని కూడా ఎత్తివేసిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ముళ్లకంచెలను పీకి ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చిందని అలాగే గతంలో మంత్రులను కూడా పోనీయని ప్రగతి భవన్ ను సామాన్య మానవుడు పోయే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారని పేర్కొన్నారు.ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్థిక వనరులను సృష్టించుకుంటూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ 10 లక్షల వరకు పెంపు మరియు కరెంటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, మహిళలకు 500 కు గ్యాస్ కలెక్షన్ పథకంతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని వివరించారు. ఉద్యోగ అవకాశాలను చేపడుతూ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తూ ప్రభుత్వం సమన్వయంతో పని చేస్తుంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పది రోజుల నుండే బిఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రభాకర్ అన్నారు.