మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 9
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం నుండి చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడారి రమేష్ యాదవ్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు గండ్ర వెంకట రమణారెడ్డి భూపాలపల్లిలో గురువారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కోడారి రమేష్ యాదవ్ మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని..భూపాలపల్లి ప్రాంతాన్ని, ఈ ప్రాంతంలోని సబ్బండ వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్న మన అభివృద్ధి ప్రదాత గండ్ర వెంకట రమణారెడ్డిని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు, జడ్పిటిసి జోరుక సదయ్య, వైస్ ఎంపీపీ పోలినేని రాజేశ్వర్ రావు, మొగుళ్ళపల్లి సర్పంచ్ మోటే ధర్మన్న, బీఆర్ఎస్ మొగుళ్ళపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఏలేటి నరసింహారెడ్డి, నాయకులు ముడుపు రవీందర్, మంగళపల్లి శ్రీనివాస్, బండారి రామస్వామి తదితరులున్నారు.