
BRS leaders sent Congress party dues cards
కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డ్స్ ను పంపించేసిన బీఆర్ఎస్ నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి

కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డ్స్ ని ఖాసీంపల్లి 12 13 వ వార్డ్లొ ఇంటిఇంటికి పంచిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు
కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన 6 గ్యారంటీ లు 420 హామీలు అమలు చేయాలనీ పిఏసిఎస్ చైర్మన్ మేకల సంపత్ యాదవ్ డిమాండ్ చేసారు.
మునిసిపల్ పరిధిలోని 12 13 వ. వార్డుల్లో కాంగ్రెస్ బాకీ కార్డ్స్ పంపిణి సందర్బంగా సంపత్ యాదవ్ మాట్లాడుతూ ఎలక్షన్ హామీలొ భాగంగా అధకారం లోకి వచ్చింన 100 రోజుల్లో ఏక కాలం లొ ప్రతి రైతు కి 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి 41 వేల కోట్లలొ కేవలం 13 వేల రుణమాఫీ మాత్రమే చేసారని, రైతు బంధు క్రింద ఎకరాకి 15 వేల రూపాయలు ఇస్తామని గడిచిన 22 నెలల్లో ఒకసారి రైతు భరోసా నిధులు ఎగొట్టి అరకొర గా వేయడం జరిగింది అని అన్నారు.
అంతే కాక కల్యాణ లక్ష్మి క్రింద లక్ష రూపాయల తో పాటు తులం బంగారo ఇస్తామని చెప్పి మోసం చేసిందని అన్నారు.
మహిళలకు 2500 రూపాయలు, ఆదపిల్లల కు స్కూటి తో పాటు వృద్ధుల,వితంతు పెన్షన్లు 2 వేల రూపాయల నుండి 4 వేలు పెంచుతామని చెప్పి ఇప్పటికి కూడా కెసిఆర్ ఇచ్చిన 2 వేల రూపాయలు పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు
రైతులకు కనీస మద్దతు ధరతో పాటు వడ్ల కు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మాట తప్పడమే కాకుండా కనీసం యూరియా కూడా సప్లై చెయ్యలేని దయనీయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేసారు,
అనేక హామీలు ఇచ్చి తెలంగాణా లొని అన్నీ వర్గాల ప్రజలని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వనికి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లొ ప్రజలు గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమంలొ బీ ఆర్ ఎస్ అర్బన్ ప్రెసిడెంట్ కటకం జనార్దన్, సెగ్గం సిద్దు, 13 వ వార్డ్ తాజా మాజీ కౌన్సిలర్ మంగళపల్లి తిరుపతి, మాజీ చైర్మన్ బండారి రవి, 12 వ వార్డ్ అధ్యక్షులు మేనం రాజేందర్, నాయకులు పోలేవేనా అశోక్, మామిడి కుమార్, బొంతల సతీష్, నలిగేటి సతీష్, ప్రతాప్ రెడ్డి, ఈశ్వర్, అర్బన్ నాయకులు బీబీ చారి తదితరులు పాల్గొన్నారు.