గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
కార్యకర్తలకు వెన్ను దన్నుగా నిలిచేది ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు వట్టం రాంబాబు అన్నారు. మంగళవారం గుండాల మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు బొబ్బిలి తిరుపతి తండ్రి బొబ్బిలి పాపయ్య అనారోగ్యంతో మరణించడంతో రేగా కాంతారావు ఆదేశాల అనుసారం తిరుపతి కుటుంబాన్ని పరామర్శించి పాపయ్య పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం వట్టం రాంబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు వెన్నుదన్నుగా నిలిచే నాయకుడు రేగా కాంతారావు అని అన్నారు. కార్యకర్తకు ఆపద వచ్చిందంటే ముందు వరుసలో ఉండి వారికి అండగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోడియం నరేందర్, పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ, నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ పాయం ప్రవీణ్ కుమార్, మాజీ సర్పంచులు దుర్గారావు, రాఘవులు, మడి వీరన్న, ఎక్స్ ఎంపీటీసీ శ్రీను, గుండాల ఎస్టీ సెల్ లక్ష్మీనారాయణ, తాటి కృష్ణ, సుధాకర్, బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్, గడ్డం వీరన్న, కుమార్, కృష్ణ, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు