
చిల్పూర్(జనగామ) నేటి ధాత్రి గతంలో చిల్పూర్ మండల పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహించిన శ్రీనివాస్ యాదవ్ కు ఇటీవల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ పొంది రఘునాథ్ పల్లి సీఐగా పదవి బాధ్యతలు తీసుకున్న ఎల్లబోయిన శ్రీనివాస్ యాదవ్ ను చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామ బిఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూల భోకేను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తాళ్ల పెళ్లి సమ్మయ్య, మాజీ ఎంపిటిసి గడ్డమీది అశోక్ కుమార్, మాజీ ఏఎంసి డైరెక్టర్ బీసీ సంక్షేమ శాఖ సంగం చిల్పూర్ మండల అధ్యక్షులు బత్తుల రాజన్ బాబు,టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఇల్లందుల హరిబాబు, గుంటి మల్లయ్య,గడ్డమీది వెంకటస్వామి,ఇల్లందుల విజయ్ కుమార్,తాళ్లపల్లి శ్యామ్ గౌడ్,చిలక రమేష్ తదితరులు పాల్గొన్నారు.