జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న షేక్ ఫరీద్ మరియు షేక్ సోహెల్ నాయకులు
మాగంటి సునీత గోపీనాథ్ ని అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ నాయకులు ఇంటింటి ప్రచారంలో పాల్గొని బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓట్లను కోరారు. బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ ఫరీద్ తో కలిసి ఝరాసంగం మండల తుమ్మన్ పల్లి గ్రామ మైనారిటీ సీనియర్ నాయకులు షేక్ సోహెల్ బీఆర్ఎస్ దే విజయం ఖాయమని జూబ్లీహిల్స్ – ఉపఎన్నికలో గులాబీకే 100% విజయావకాశాలు..కారుతో పోటీపడి గెలవడం కాంగ్రెస్ కు అసాధ్యం..45 రోజుల సర్వే లో 55.2శాతం ప్రజా మద్దతు బెదిరింపు రాజకీయాలకు భయపడే లేదు – మీ నకిలీ వాగ్దానాలు,దబాయింపులకు జూబ్లిహిల్స్ ఓటమితో ముగింపు..2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? : టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించి, అభివృద్ధిలో పాలి భాగస్తులు కావాలని ఓటర్లను కోరారు.
వారితోపాటు శశివర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు
