BRS Leader Joins BJP
బిఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిక.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలోని ఆసరవెల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు గుండబోయిన తిరుపతి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరగా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు..ఈ సందర్బంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి పార్టీ నిధులతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని గ్రహించి బిజెపి పార్టీలో చేరుతున్నారన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి యాదగిరి,నాయకులు ఊటుకూరి చిరంజీవి గౌడ్, హుసేన్,కిషన్,సుమన్,వీరన్న,స్వామి,రాజకుమార్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
