కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలను కాపాడుకునే ప్రభుత్వమే బిఆర్ఎస్ ప్రభుత్వం

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేనీ నరేందర్

వరంగల్, నేటిధాత్రి

చేనేత మిత్ర పథకం ద్వారా ప్రతి మగ్గం కార్మికుడి నెలకు 3000 ఆర్థికసాయం అందిచడానికి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కి కొత్తవాడ జంక్షన్ లో కొత్తవాడ నేత కార్మికులతో కలసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ క్షిరాభిషేకం నిర్వహించారు. చేనేత కార్మికులను గుండెల్లో పెట్టుకునే చూసుకునే గొప్ప నాయకులు కేసీఆర్, కేటీఆర్, తెలంగాణ సర్కారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమానికి మేయర్ గుండు సుధారాణి హాజరయ్యారు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ లకు నేతన్నలు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతల పట్ల మరోమారు గొప్ప మనసును చాటుకొని బాసటగా నిలిచిందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను రద్దుచేసి నేతన్నల జీవితాలను ఆగం చేయడానికి చూశారని,
ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ సర్కారు నేతన్నలను కడుపులో పెట్టుకొని చూసుకోవాలని గొప్ప సంకల్పంతో ఇప్పటికే నేతన్నకు బీమాను ఏర్పాటు చేశారు, 75 సంవత్సరాల వయసు వరకు ఇన్సూరెన్స్ వర్తిపజేయడం 12వేలు ఉన్నటువంటి దానిని 25వేలు చేయడం, 3016 రూపాయలు పెన్షన్ అందించబోతున్న మనసుగళ్ళ సర్కారని కేసీఆర్, కేటీఆర్ ల దార్శనికతకు ఇది నిదర్శనం అని ఎమ్మెల్యే అన్నారు.
2015లో ఇదే నేతన్నల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ని పలుమార్లు కలిసి వారూ ఉత్పత్తి చేసిన కార్పెట్స్, బెడ్ షీట్, ఖరీదు చేపించి అండగా నిలవడం జరిగిందన్నారు.5వేల మంది ఉన్న కొత్తవాడ చేనేత కార్మికులకు, భవిష్యత్ లో వారి పిల్లలకు మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా ఆదుకునే విదంగా చూస్తామన్నారు. అన్ని వర్గాలను కాపాడుకునే ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. కొత్తవాడ, కరిమాబాద్, రంగశాయిపేట మరియు ఇతర ప్రాంతాల్లో ఉన్న నేత కార్మికులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యేలుగం లీలావతి సత్యనారాయణ, కార్పొరేటర్ గుండేటి నరేందర్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు అడెపు రవీందర్, కొత్తవాడ చేనేత సొసైటీల అధ్యక్షులు పంతగాని శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు గోరంట్ల రాజు, చిప్ప వెంకటేశ్వర్లు, రవి రాజ్, బేతి అశోక్, వడ్నాల నరేందర్, ఎలగం శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు బొల్లు సతీష్, ముఖ్య నాయకులు, చేనేత సంఘాల అధ్యక్షులు, చేనేత పెద్దలు, చేనేత కార్మికులు హాజరయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!