చెగ్యాo ,తాళ్లకోతపేట గ్రామాల్లో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం!!

కొప్పుల ఈశ్వర్ ను బారీ మెజారిటీ తో గెలిపించాలని
కొప్పుల స్నేహ లత ప్రచారం!!
ఎండపల్లి నేటి ధాత్రి

పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సోమ వారం, వెల్గటూర్ మండలం చెగ్యం, తాళ్లకొత్తపేట గ్రామాల్లో పెద్దపల్లి పార్లమెంట్ బి ఆర్ ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ని అధిక మెజారితో గెలిపించాలని ఆయన సతీమణి కొప్పుల స్నేహాలత ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా కొప్పుల స్నేహ లత మాట్లాడుతూ గతం లో ఈ ప్రాంతానికి శాసన సభ్యులు గా మంత్రి గా ఉండి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసారని, ప్రతి గడపకు ఈశ్వర్ ఒక కుటుంబంలో ఒక ఆత్మీయునిగా ఉన్నారని, ఏ క్షణం పిలిస్తే అక్షణం పలికే నాయకుడిగా కాకుండా సేవకుడిగా ఉన్నాడని, ఆయన సేవలుఇంకా ఈ ప్రాంతానికి కావాలని, ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తు కు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ గారిని అధిక మెజారితో ఎంపీ గా గెలిపించాలని ఆమె కోరారు,ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ కునమల్ల లక్ష్మీ లింగయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, పత్తిపాక వెంకటేష్, అల్లం దేవమ్మ, పార్టీ ప్రధాన కార్యదర్శి జూపాక కుమార్, ఎస్ సి సెల్ అధ్యక్షులు కొప్పుల సురేష్,సర్పంచులు రామిల్ల లావణ్య సనీల్, ద్యావనపెళ్లి లక్ష్మీ ఎల్లయ్య, మూగల సత్యం, పెద్దూరి భరత్, ద్యావనపెళ్లి సుధాకర్, కొళ చరణ్, గాజుల భానిష్, బాలసాని రవి, కుశనపెళ్లి రవి, కుశనపెళ్లి రాజమని, ఒల్లల విజయలక్ష్మి, కాల్వ శిరీష, రంగు భూమయ్య, దస్తగిరి, రాం రెడ్డి, శ్రీను, మాదాసు రమేష్,కునమల్ల లింగయ్య, ఎల్కాటూరి స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!