Strong BRS Campaign by Ghanta Kalavati in Ward 12
వార్డు ప్రజలకు అండగా గంట కళావతి 12వ వార్డులో జోరుగా బిఆర్ఎస్ ప్రచారం
పరకాల,నేటిధాత్రి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 12వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి గంట కళావతి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం ఆమె ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ తమకే ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.ప్రచారంలో భాగంగా వార్డులో అనారోగ్యంతో ఉన్న కుటుంబాన్ని పరామర్శించిన ఆమె,ఎప్పుడూ వార్డు ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
గంట కళావతి చేపడుతున్న ప్రచారానికి వార్డు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. “మీకు మా పూర్తి సహకారం ఉంటుంది.. గెలుపు మీదే” అంటూ ఓటర్లు హామీ ఇస్తున్నారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ గెలుపు ఖాయమని వార్డు ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
