వైద్యులు మహేష్ రెడ్డి, చంద్ర ప్రకాష్
చేర్యాల నేటిధాత్రి;
చిన్నారులకు తల్లిపాలను మించిన ఔషధం లేదని వైద్యులు మహేష్ రెడ్డి అన్నారు. చేర్యాల మండల కేంద్రంలోని స్థానిక వెంకట సాయి హాస్పిటల్ వైద్యులు చెరుకు శ్రీనివాస్ దీపాంజలి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్టు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తో పాటు పౌష్టికాహారం, మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్యులు జె.మహేష్ రెడ్డి, చంద్ర ప్రకాష్ లు హాజరై మాట్లాడారు. బిడ్డకు తల్లీ పాలను తప్పనిసరిగా ఇవ్వాలని.. అప్పుడే తల్లి బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉంటారని, తల్లికి రొమ్ము క్యాన్సర్ లాంటివి రావని సూచించారు. తల్లిపాల సాంస్కృతిని ప్రోత్సహించి, సహకరించి రక్షించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. తల్లిపాలలో అధిక పోషకాలున్నాయని,రోగ నిరోధక శక్తి అధికంగా ఉండే తల్లిపాలను పుట్టిన గంటలోపు బిడ్డకు తప్పనిసరిగా పట్టించాలని సూచించారు. పిల్లలకు తల్లిపాలు ఇవ్వకుంటే భవిష్యత్తులో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అందుకు, తల్లిపాలను ఇవ్వడం వల్ల చిన్నారుల్లో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండన్నారు. తల్లులు అపోహాలు వీడి తల్లిపాలను ఇవ్వాలని సూచించారు. బిడ్డ పుట్టినప్పటినుంచి కనీసం 6 నెలల వరకు పసిపిల్లలకు తల్లిపాలను పట్టించడం ఎంతైనా అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపుతుందని సూచించారు. ఈ అవగాహన సదస్సులో, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, గర్భిణీలు, పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.