ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రంథాలయంలో పుస్తక దినోత్సవం
సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో99 రోజుల
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో
భాగంగా గ్రంథాలయంలో పుస్తక దినోత్సవం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్
కటుకూరి రాధిక శ్రీనివాస్ హాజరై సరస్వతి దేవి చిత్ర పటానికి జ్యోతి వెలిగించి ఘనంగా నిర్వహించడం జరిగింది
వారు మాట్లాడుతూ గ్రంధాలయంలో ఉన్న ప్రతి పుస్తకం చాలా విలువైనది ప్రతి ఒక్కరూ వచ్చి పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకోవాలని చదువుకునే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పుస్తకాలు మహనీయుల చరిత్ర భారతీయ సంస్కృతి ప్రజా పాలన ఉద్యోగ అవకాశాలు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయని వారు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ వార్డు సభ్యులు తిక్క సంపత్ కోడెపాక అనిల్ పాసి కంటి రామకృష్ణ దూడపాక దుర్గయ్య దూడపాక అఖిల్ మైనార్టీ మండల నాయకులు ఎండి సైదులు ఎస్.కె బహదూర్ బొడిగె శివ గ్రంధాలయ సి బ్బంది ఆదిముల్లా మురళి తదితరులు పాల్గొన్నారు
