నర్సంపేట పిఎసిఎస్ చైర్మన్ గా బొబ్బల రమణారెడ్డి

పిఎసిఎస్ చైర్మన్ ను అభినందించిన ఎమ్మెల్యే మాధవరెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట మండల వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) గత చైర్మన్ పై మార్చి12 న అవిశ్వాసం కాంగ్రెస్ పార్టీ నెగ్గింది.అనంతరం గత చైర్మన్ మోరాల మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో తదుపరి చైర్మన్ ఎన్నికను హైకోర్టు వాయిదా వేయడంతో ఈ నెల 21న మోహన్ రెడ్డి పిటిషన్ ను రద్దుపరిచిన కోర్టు వైస్ చైర్మన్ మెరుగు శ్రీనివాస్ ను చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఐదు రోజుల తర్వాత గురువారం చైర్మన్ ఎన్నికను నిర్వహించగా 13 మంది సభ్యుల గాను 9 మంది సభ్యులు పాల్గొని బొబ్బల రమణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిస్టిక్ కోపరేటివ్ సొసైటీ ఆఫీసర్ సంజీవరెడ్డి ఎన్నికల నిర్వహణ అధికారిగా పాల్గొని అధికారికంగా రమణారెడ్డి ఎన్నికను ఏకగ్రీవంగా జరిగినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు 9 మంది డైరెక్టర్లు మెరుగు శ్రీనివాస్, గుజ్జుల మాధవరెడ్డి, బైరి జనార్దన్ రెడ్డి, దామెర రవి, బానోతు లక్ష్మణ్, తిరుపతి హాజరయ్యారు. అనంతరం రమణారెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు గాను చైర్మన్ ను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్ రావు, టిపిసిసి సభ్యులు రామానంద్, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి కిరణ్, మహేశ్వరం సర్పంచ్ నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దండెం రతన్ కుమార్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!