
భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలంలోని గోదావరి నది స్నానగట్టాల వద్ద గోదావరి నదిలో దిగి ఆత్మహత్యకు ప్రయత్నించిన వృద్ధురాలిని కాపాడిన బ్లూ కోట్స్ పోలీసులు. కొత్తగూడెంలోని రామవరం కాలనీకి చెందిన భారతి అనే వృద్ధురాలికి కడుపునొప్పి ఉందని, తన పిల్లలను ఇబ్బంది పెట్టలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపింది. ఆత్మహత్యకు ప్రయత్నించిన వృద్ధురాలని కాపాడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న బ్లూ కోట్స్ పోలీసులు సురేంద్ర, జంపయ్య.