పట్టణ అధ్యక్షుడు నసీరుద్దీన్
నిజాంపేట ,నేటిదాత్రి ,మే 10
పార్లమెంట్ ఎన్నికల లో నీలం మధును లక్ష మెజారిటీతో గెలిపించుకుంటామని నిజాంపేట పట్టణ అధ్యక్షుడు నసిరుద్దీన్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
బిజెపి, భీఆర్ఎస్ పార్టీలతో పది సంవత్సరాలుగా మోసపోతునే ఉన్నాం మళ్లీ మోసపోతే గోస పడదాం హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ను గెలిపించుకుంటామని ఆయన అన్నారు. గడిచిన మూడు నెలల్లోనే కోటి 85 లక్షలతో సిసి రోడ్లను నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు. భీఆర్ఎస్, బిజెపి అభ్యర్థుల మాయమాటలు నమ్మవద్దని, అగ్రకులానికి సంబంధించిన వారని, కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తని, అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మెదక్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పరుచుకుందామని తెలిపారు. అలాగే నిజాంపేట మండలం మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన అన్నారు