Court Premises Blood Donation Camp
ఉభయ వరంగల్, హన్మకొండ జిల్లాల కోర్టు ఆవరణంలో రక్తదాన శిబిరం:-
పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తులు వి.బి.నిర్మలా గీతాంబ, డా. కె.పట్టాభి రామారావు:-
హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
మంగళవారం నాడు హన్మకొండ మరియు వరంగల్ జిల్లాల బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వి.బి.నిర్మలా గీతాంబ, డా. కె.పట్టాభి రామారావు పాల్గొన్నారు. ఇట్టి సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ రక్తదానం చేసిన న్యాయవాదులను మరియు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఇరు బార్ అసోసియేషన్ లను మరియు రెడ్ క్రాస్ సొసైటీ ని అభినందించారు.
ఇట్టి కార్యక్రమంలో ఇరు బార్ అసోసియేషన్ ల కమిటీ మెంబెర్స్ మరియు సీనియర్, జూనియర్ న్యాయవాదులు మరియు మహిళా న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
