మహిళల పట్ల దురుసు ప్రవర్తన మానుకోవాలి.
అన్ని బస్టాపుల్లో బస్సులు ఆపాలి.
సరిపడా బస్సులను పెంచాలి.
దాసరి రాజేశ్వరి ఐద్వా జిల్లా గౌరవధ్యక్షురాలు డిమాండ్
మంచిర్యాల, నేటి ధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న మహిళల పట్ల కొంత మంది కండక్టర్లు, డ్రైవర్లు,పురుష ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించడం,కించపరచడం, హేళన చేయడం,అవమాన పరచడం జరుగుతుంది. మహిళలు ఉన్న బస్ స్టాపులలో బస్సులు ఆపకుండా వెళ్లిపోవడం జరుగుతుంది.కూలీ పనులు ఇతర చిన్న చితక పనులు చేసుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో కూడా రాత్రి సమయమైనా బస్సులను ఆపడం లేదు.ఉచిత ప్రయాణం వచ్చిన తర్వాత మహిళలు ఏం పని,పాట లేకుండా తిరుగుతున్నారని మాట్లాడడం. మహిళలంటేనే చిన్న చూపు చూసే పద్ధతి కొనసాగుతుంది.
దీని విరమించుకోవాలని, మహిళలకు కేటాయించిన సీట్లను మహిళలకు ఇవ్వాలని,అన్ని బస్ స్టాప్ లలో బస్సులు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని, మహిళలను కించపరుస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది.
లేకుంటే బస్ డిపో వద్ద భారీ ధర్నాకు పిలుపునివ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా నాయకులు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో దాసరి రాజేశ్వరి ఐద్వా జిల్లా గౌరవ అధ్యక్షురాలు, నాగజ్యోతి జిల్లా ఉపాధ్యక్షురాలు,సామల ఉమారాణి జిల్లా సహాయ కార్యదర్శి,జిల్లా కమిటీ సభ్యులు తమ్మ రేణుక, బోయిరే రమాదేవి,సిడం సమ్మక్క,బోండ్ల సరిత, జడల యామిని,
మరియు నాయకులు గావిడి భూదేవి,రాతిపల్లి సంధ్య,కామేర సరిత,
అలుగునూరి రజిత,మడే తులసమ్మ,గావిడి సప్న, గావిడి స్వరూప,మోతె లక్ష్మి, కుమ్మరి ఎల్లక్క, తదితరులు పాల్గొన్నారు.