* శ్రీకాళహస్తిలో కోలాహాలంగా బీజేపీ శ్రేణుల విజయోత్సవ వేడుకలు
* బీజెపి రాష్ట్ర కార్యదర్శి,అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్
శ్రీకాళహస్తి (నేటి ధాత్రి) ఫిబ్రవరి 08:
పట్టణంలోని బెరివారి మండపం కూడలి వద్ద బీజేపీ నేత కోలా ఆనంద్ నేతృత్వంలో భారీ స్థాయిలో శనివారం విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కారు వలన ఢిల్లీ అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేస్తే.. కేజ్రీవాల్ ఢిల్లీని భ్రష్టుపట్టించారన్నారు.
వాయు, రాజకీయ కాలుష్యంతో కలుషితం జరిగిందన్నారు.ఈ గెలుపు ఢిల్లీ అభివృద్ధికి మలుపని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కో-కన్వీనర్ మేళాగారం సుబ్రమణ్యంరెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి గోపాల్,రాష్ట్రకార్యవర్గ సభ్యులు ఎస్వీ రమణ, పట్టణ అధ్యక్షులు ఆర్.హరీష్ రెడ్డి,వేడం కృష్ణయ్య,చిలకా రంగయ్య,సొట్ట సుకుమార్,బగీర్తి వెంకటేష్,కోలా గోవర్ధన్,కుప్పప్రసాద్,గాలి రమేష్ నాయుడు,
పేటసుబ్రమణ్యం తదితులున్నారు.