ఉమ్మడి కరీంనగర్ లో బిజెపి సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ధర్నా
సిరిసిల్ల 🙁 నేటి ధాత్రి )
బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి నేడు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఉమ్మడి కరీంనగర్ బిజెపి కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొనడం జరిగింది.
₹2 లక్షల రుణమాఫీ హామీ అమలు చేయాలని, రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని, వ్యవసాయ కూలీలకు ₹12,000 అందించాలని, పంటల బీమా యోజన అమలు చేయాలని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ బిజెపి జిల్లా కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు