బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ను గెలిపించాలి

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కాసింపల్లి సెగ్గంపల్లి జంగేడు పకీరు గడ్డ కాలనీలలో ఇంటింట ప్రచారం చేయడం జరిగింది ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నం పల్లి పాపన్న హాజరై వారు మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మరి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మహిళలకు 2500 రూపాయలు ఇస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఏ మహిళ కూడా ఇవ్వలేదని వారన్నారు డిసెంబర్ 9వ తారీకు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి మరి ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయలేదన్నారు అంతే కాకుండా రైతులకు రైతు భరోసా 15000 ఇస్తానని రైతు కూలీలకు 12,000 ఇస్తానని మరి ఏ ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ 400 ఎంపీ సీట్లకు పైగా గెలిచి దేశ ప్రధాని కావడం కాయం ప్రజలందరికీ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత బిజెపి పార్టీదీ విశ్వకర్మ యువజన ద్వారా 18 కులవృత్తులకు శిక్షణ ఇచ్చి మరి మూడు లక్షల రూపాయల లోను ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ప్రతి ఒక్కరికి పేద మధ్యతరగతి వాళ్లకు అండగా ఉన్నది అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కాబట్టి వరంగల్ పార్లమెంటు అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు దొంగల రాజేందర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వేషాల సత్యవతి అర్బన్ ప్రధాన కార్యదర్శి తుమ్మేటి రామ్ రెడ్డి జోరు కృష్ణ కాంత్ బూతు అధ్యక్షులు రాజు అనిల్ గుణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!