రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట బీజేపీ గ్రామశాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ 74వ జన్మదినం సందర్భంగా గుండి గోపాలరావుపేట ప్రాధమిక ఆరోగ్య ఉపకేంద్రంలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈసందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ మోడీ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా మరెన్నో చేసుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆసుపత్రి వైద్యురాలు గ్రీష్మనియా, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు కళ్లెం శివ, యువమోర్చా మండల ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్, బూత్ కమిటీ అధ్యక్షులు పల్లపు చిరంజీవి, రేండ్ల తిరుపతి, ఎగుర్ల రవి, ఏగోలపు అనిల్, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.