భూపాలపల్లి నేటిధాత్రి
భారత ప్రధాని నరేంద్రమోదీ సెప్టెంబర్ 17న జన్మదినం సందర్భంగా, వారం రోజులు వివిధ కార్యక్రమాల్లో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గలిఫ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు ఏడు నూతల నిశిధర్ రెడ్డి హాజరై అనంతరం ఆయన మాట్లాడుతూ,మన భారత ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ కు ముఖ్యమంత్రి గా పనిచేసి అభివృద్ధిని ఈ దేశానికి ఒక మాడల్ గా చూపిస్తూ, గత పది సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలన చేస్తూ ప్రపంచంలోనే శక్తి వంతమైన దేశంగా ఈ దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టారు
దేశంలోని పేద ప్రజల కళలను సాకారం చేస్తూ బడుగు బలహీనర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి దిశగా ఈ దేశాన్ని నడిపిస్తున్నారు
అవినీతి రహితంగా సుపరిపాలన అందిస్తూ ఈ రోజు భారత దేశాన్ని ఐదోవ ఆర్థిక శక్తిగా తయారుచేసి భవిష్యత్తు లో ఇంకా ఈ దేశంలోని యువతకు మహిళలకు, రైతులకు,అభివృద్దే ఎజెండా గా పనిచేస్తూ ఈ దేశానికి సేవకుడిగా పనిచేస్తున్న నాయకుడు నరేంద్రమోదీ
మూడో సారి ప్రధాని అయ్యాక అనేక సహసోపిత నిర్ణయాలు తీసుకుంటూ దేశ పురోగభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు
కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ దేశాన్ని కాపాడుకుంటూ ఒక స్థిరమైన అభివృద్ధిని ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ముందుకు పోతున్న నాయకుడు మోదీ కాబట్టి ఆయన ఎప్పుడూ ఆయురారోగ్యాలతో వుండాలని మనందరం ఆయన మార్గదర్శనం లో పని చేయాలని పిలుపునిచ్చారు
, బడుగు బహీనవర్గాల నాయకుడు శ్రీ నరేంద్రమోదీ గారు, పేదల కష్టాలు తెలిసిన నాయకుడు మోదీ ని క్రమశిక్షణ అకుంఠిత దీక్ష తో పనిచేసే నాయకుడు నరేంద్రమోదీ చాయి అమ్మే వ్యక్తి కొడుకు కూడా దేశ ప్రధాని కాగలడు అని నిరూపించిన వ్యక్తి మోదీ పరిపాలన ఈ దేశానికి ఎంతో అవసరం అని అందుకే మోదీ నిండు నూరేళ్ళు బ్రతకాలని ఆ దేవున్ని ప్రార్టిస్తున్నామని తెలిపారు
ఈ కార్యక్రమంలో లింగంపల్లి ప్రసాద్ రావు బట్టు రవి దొంగల రాజేందర్ వేషాల సత్యవతి సామల మధుసూదన్ రెడ్డి మచ్చనేని రవీందర్ రెంటాల విప్లవ్ కుమార్ ఊరటి మునేందర్ తుమ్మేటి రామిరెడ్డి బుర్ర వెంకటేష్ దాసరి తిరుపతిరెడ్డి మంద మహేష్ నవీన్ రావు జంజర్ల సురేష్ కర్వేద మనోహర్ కర్ర జయపాల్ రెడ్డి కడువేని రాకేష్ వాకటి రాజు బానోతు రాజేందర్ ఎర్ర రాకేష్ రెడ్డి ఆకుల శ్రీనివాస్ అంబటి రాజ్ కుమార్ గుండా మణికుమార్ పుణ్ణం చందర్ ఏసోజు శివరాజ్ చెక్క శంకర్ బోల్లపల్లి తిరుపతి తదితరులు పాల్గొనడం జరిగింది