అయ్యప్పస్వామి మండల పూజ సందర్భంగా స్వాములు ఊరేగింపు
వనపర్తి నేటిధాత్రి .
రాజనగరం అయ్యప్పస్వామి ఆలయంలోకి శుక్రవారం మండల పూజ సందర్భంగా అయ్యప్ప స్వాములు ఊరేగింపు నిర్వహించారుమండల పూజ
ఉత్సవంలో స్వామి వారి ఆభరణాలు అయ్యప్పస్వామి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చీర్ల.కృష్ణ సాగర్ గురుస్వామి అద్యర్యము లో ఊరేగింపు నిర్వహించారు అయ్యప్ప స్వాములు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆలయ కమిటీ అధ్యక్షులు ముత్తు కృష్ణ గురుస్వామి,కోశాధికారి పాపిరెడ్డి,ప్రచార కార్యదర్శి అమర వాది చిట్యాల నరేందర్ గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మండల పూజ భక్తిశ్రద్ధలత జెరుగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమములో ఆలయ అర్చకులు అచ్చితాపురం రమేష్ బాబు ,బీచుపల్లి యాదవ్ ,వాకిటి.శ్రీధర్ నందిమల్ల.అశోక్, యాదగిరి,ఆవుల.రమేష్ ,భక్తులు పాల్గొన్నారు
