
BJP Plans Successful District Visit
రాష్ట్ర అధ్యక్షుని పర్యటన విజయవంతం చేయండి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం, కొక్కెరకుంట గ్రామాల శక్తి కేంద్రం ఇంఛార్జి వేముండ్ల కుమార్ ఆధ్వర్యంలో శక్తి కేంద్రం పరిధిలోని బూత్ కమిటీలతో శనివారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి, కార్యక్రమ ఇంఛార్జి పోచంపెల్లి నరేష్ లు హాజరై మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సెప్టెంబర్ 3న జరిగే జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి బూత్ నుండి కూడా అధిష్టానం చెప్పిన విధంగా కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. తదనంతరం పలు వినాయక మండపాలను సందర్శించారు. ఈకార్యక్రమంలో మండల కార్యదర్శి గుంట అశోక్, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి దయ్యాల రాజు, శేవాళ్ళ అక్షయ్, బూత్ కమిటీ అధ్యక్షులు కట్టెకొల మహేష్, కోడూరి గంగరాజు, నాగం రమేష్, గుంట సంజీవ్, బత్తిని సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.