
చిట్యాల,నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోబుదవారం రోజున కాంగ్రెస్అగ్రనేత *ఎంపి.రాహుల్ గాంధీ * జన్మదినం సందర్భంగా చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ అద్యక్షతన కేక్ కట్ చేసి మిఠాయిలు పంచడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి రాహుల్ గాంధీ గొప్పతనాన్ని ఉద్దేశించి భారత్ జోడో యాత్ర, ప్రతిపక్ష నేతగా విజయం సాధించరని మాట్లాడటం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దబ్బెట రమేష్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం కొమరయ్య టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ కాంగ్రెస్ సీనియర్ చిలకల రాయ కొమురు కో ఆప్షన్ నెంబర్ రాజ్ మహమ్మద్ జిల్లా నాయకులు, మండల యూత్ కమిటీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.