
రామకృష్ణాపూర్, మార్చి 23, నేటిధాత్రి:
మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడటమే భగత్ సింగ్ కు ఘనమైన నివాళి అని సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ అన్నారు.శనివారం సర్దార్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 93వ వర్ధంతి వేడుకలను రామకృష్ణాపూర్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిట్టపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ…. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ముగ్గురు అమరులు చేసిన త్యాగం దేశ ప్రజలు మరువలేనిది అని అన్నారు.ప్రస్తుత రోజుల్లో బిజెపి ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కంటే భయంకరమైన మతోన్మాదాన్ని దేశంలో ప్రేరేపిస్తూ మత చిచ్చు రేపుతున్న మతోన్మాదులను వారి ఆలోచన విధానాలను ప్రజలందరూ గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మిట్టపల్లి పౌల్,వెంకట స్వామి, సత్యనారాయణ, సాంబయ్య, ఈరవేణి రవి తదితరులు పాల్గొన్నారు