భారత రాజ్యాంగ పితామహుడు డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతి
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు పట్టణం లోని *రహదారి,మున్సిపల్,బాబు మోహన్ కాలనీ,లో గల విగ్రహాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పిగా,ప్రజాస్వామ్య పరిరక్షకునిగా,సంఘసంస్కర్తగా,విఖ్యాతుడైన అంబేద్కర్ గారికి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప,మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్ , పెంట రెడ్డి,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,పాక్స్ చైర్మన్ చైర్మన్ మచెందర్, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహి ఉద్దీన్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,యువ నాయకులు మిథున్ రాజ్,మహిళ పట్టణ అధ్యక్షురాలు మంజుల, జాగృతి అధ్యక్షురాలు అనుషమ్మ, బి ఆర్ ఎస్వీ అధ్యక్షులు రాకేష్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.