అభినందించిన మంత్రి పొన్నం…..
నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)దేశ రాజధాని లో ఇటీవల జరిగిన కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో రెండవ స్థానం సాధించిన చిన్నారి బిల్హరి నీ రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.కూకట్ పల్లి ఎంఎన్ఆర్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న బిల్ హారి ఇండియన్ కరాటే అంతర్జాతీయ చాంపియన్ కు అర్హత సాధించడం తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శం అని కొనియాడారు.ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రుల తో పాటు కోచ్ ను మంత్రి అభినందించారు.