పరకాల నేటిధాత్రి
జనగామ న్యాయవాది అమృత రావు దంపతుల మీద జనగామ సీఐ మరియు ఎస్ఐ చేసిన దాడిని ఖండిస్తూ గురువారం రోజున హన్మకొండ జిల్లా పరకాల న్యాయవాదులు విధులను బహిష్కరణ చేస్తూ బైక్ ర్యాలీ తో నిరసన వ్యక్తం చేశారు.అనంతరం పరకాల ఆర్డీఓ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల మీద దురుసుగా ప్రవర్తించిన పోలీసు వారిపై కఠిన చర్యలు తిడుకోవాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో శ్రావణ్ కుమార్,వేణు,రాహుల్ విక్రమ్,రఫీ,జె రాజు,పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.